Share News

దేశం మెచ్చిన నేత జగ్జీవన్‌రామ్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:51 PM

భారతదేశ ఉప ప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ దేశం మెచ్చిన నేతగా చరిత్రలో నిలిచి పోయారని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

దేశం మెచ్చిన నేత జగ్జీవన్‌రామ్‌
జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో మంత్రి తదితరులు

నివాళులర్పించిన మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల మున్సిపాలిటీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): భారతదేశ ఉప ప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ దేశం మెచ్చిన నేతగా చరిత్రలో నిలిచి పోయారని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. జగ్జీవన్‌రామ్‌ 118 జయంతి వేడుకలు నంద్యాలలో శనివారం ఘనంగా జరిగాయి. విక్టోరియా రీడింగ్‌ రూంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రితో పాటు కలెక్టర్‌ రాజకుమారి, జేసీ విష్ణుచరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగా బనగానపల్లె పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Apr 05 , 2025 | 11:51 PM