ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Byreddy Shabari comments: నేనేదీ మర్చిపోను... ఎంపీ బైరెడ్డి శబరి హాట్ కామెంట్స్

ABN, Publish Date - Mar 15 , 2025 | 12:38 PM

Byreddy Shabari comments: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఎంపీ బైరెడ్డి శబరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది నెలలుగా సిద్ధార్ధ్ రెడ్డి ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. సిద్ధార్థ రెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారంటూ ఎద్దేవా చేశారు.

Byreddy Shabari comments

కర్నూలు, మార్చి 15: వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై (YSRCP Leader Byreddy Siddarth Reddy) నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (MP Byreddy Shabari) ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ‘ఏం అభివృద్ధి చేశారో చర్చించడానికి నేను సిద్ధం. సిద్దార్ధ రెడ్డి సిద్దమా’ అంటూ ఎంపీ సవాల్ విసిరారు. ‘బైరెడ్డి అంటే నేను... సిద్దార్ధ రెడ్డి కాదు. కేసులు, అరెస్టుల గురించి సిద్దార్ధ రెడ్డి మాట్లాడుతున్నారు.. అసలు అక్క అని చూడకుండా నాపై కేసులు పెట్టించారు.. మా కార్యకర్తలపై దాడులు చేయించారు. ఏనాడూ బయటకు రాని మా అమ్మపై వ్యక్తిగత విమర్శలు చేశారు. నేను మర్చిపోను. జగన్ తల్లిని, చెల్లిని ఎలా చేశారో.. ఇక్కడా అదే చేస్తున్నారు. చాలా రోజులుగా సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని సిద్ధార్థ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


9 నెలలుగా సిద్ధార్థ రెడ్డి ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. కార్యకర్తల గురించి మాట్లాడే హక్కు సిద్ధార్థ రెడ్డికి లేదన్నారు. ఫుల్ బాటిల్ వేయడం బాగా అలవాటైనట్టుంది అని ఎద్దేవా చేశారు. జగన్ మళ్ళీ రావాలని అనుకుంటున్నారని.. అయితే కల్తీ మద్యం, డ్రగ్స్, గంజాయి మళ్లీ రావాలని జగన్ రావాలనుకుంటున్నారా అని నిలదీశారు. వైసీపీ నేతల అవినీతిని తమ ప్రభుత్వం ఖచ్చితంగా బయట పెడుతుందని స్పష్టం చేశారు. సిద్ధార్థ రెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారని.. సినిమాల్లో ట్రై చేసుకుంటే బెటర్ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి బయటికి వస్తుందని... శిక్ష తప్పదని అన్నారు. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ అందుబాటులోకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారని తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్ అవసరం లేదని ఎంపీ తెలిపారు.

CM Chandrababu Swatch Andhra: రెట్టింపుగా పనిచేస్తా.. సహకారం ఇవ్వండి


ఎంపీ భావోద్వేగం...

కాగా.. కర్నూలులో హత్యకు గురైన సంజన్న కుటుంబాన్ని ఎంపీ బైరెడ్డి శబరి పరామర్శించారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు బైరెడ్డి శబరి. కక్షలకు, వర్గపోరుకు కుటుంబాలు బలి కాకూడదని.. సంజన్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా ఎంపీ అన్నారు. ‘నా కుటుంబ సభ్యుడిని నేను కోల్పోయాను. సంజన్న కుటుంబానికి నేను అండగా ఉంటా. ఈ హత్య వెనుక ఉన్న వారిని ఎవరినీ వదలపెట్టను. హత్య చేసిన వారికి టీడీపీకి సంబంధం లేదు. ఇద్దరి మధ్య గొడవ ఉన్నా హత్యలు చేసుకోవడం తగదు. ఖచ్చితంగా అందరికీ శిక్ష పడుతుంది. ఇది ప్రీప్లాన్డ్‌గా జరిగినట్లు తెలుస్తోంది. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూస్తాం. హంతకులు ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీకి ఓటు వేయాలని కత్తులు, కొడవల్లతో బెదిరిస్తూ తిరిగారు’ అని ఎంపీ బైరెడ్డి శబరి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

justice for Viveka: ఆరు ఏళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు

CM Chandrababu Swatch Andhra: రెట్టింపుగా పనిచేస్తా.. సహకారం ఇవ్వండి

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 05:30 PM