ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:49 AM
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

కర్నూలు రూరల్ ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు అర్బన మండలం మామిదాలపాడు గ్రామంలో మంగళవా రం ఎన్టీఆర్ భరోసా పింఛన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మె ల్యే పాల్గొని లబ్ధిదారులకు పింఛన డబ్బులు అందజేశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అర్హులైన ప్రతి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన ప్రతి నెల ఒకటో తేదీన సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మహిళలకు రెండో విడతలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకి మంత్రి గ్రీన సిగ్నల్ ఇచ్చారని ఆ మేరకు ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకోవాలన్నారు. అనంతరం స్థానిక ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలిం చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.