Share News

రీ సర్వే పరిశీలన

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:02 AM

ఈ.తాండ్రపాడు గ్రామంలో రీసర్వేను ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్‌ రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ గోవిందరావు, సీసీఎల్‌ఏ అడిషినల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాసులు సంయుక్తంగా పరిశీలించారు. గ్రామంలో రీసర్వే ఏ విధంగా జరుగుతోందని సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు

రీ సర్వే పరిశీలన
రీసర్వేను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు

కర్నూలు రూరల్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఈ.తాండ్రపాడు గ్రామంలో రీసర్వేను ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్‌ రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ గోవిందరావు, సీసీఎల్‌ఏ అడిషినల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాసులు సంయుక్తంగా పరిశీలించారు. గ్రామంలో రీసర్వే ఏ విధంగా జరుగుతోందని సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. భూములను సర్వే చేసేటపుడు సంబంధించిన రైతులను పిలుస్తున్నారా? లేదా?, నోటీసులు ఏవిధంగా తయారు చేసి వారికి ఇస్తున్నారు? అని అడిగారు. ప్రధానంగా ఈ.తాండ్రపాడు తెలంగాణ రాష్ట్రం ఆనుకొని ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో రీసర్వే ప్రక్రియ ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బైరాపురం రోడ్డులో రాష్ట్ర ఉన్నతాధికారికి సర్వేపై కూలంకుశంగా సర్వేయర్లు వివరించారు. కల్లూరు మండలం పర్ల గ్రామంలో జరుగుతున్న రీసర్వేను కూడా పరిశీలించారు. కర్నూలు డీసీఎల్‌వో మునికన్నన్‌, రూరల్‌ తహసీల్దార్‌ వెంకటరమేష్‌బాబు డివిజనల్‌ సర్వేయర్లు, మండల సర్వేయర్లు, విలేజ్‌ సర్వేయర్లు, వీఆర్వోలు ఉన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:02 AM