కర్నూలులో స్కిన బ్యాంక్ ఏర్పాటు
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:53 AM
రాష్ట్రంలో మొట్టమొ దటి స్కిన బ్యాంకు సెంటర్‌ను కర్నూలు రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో త్వరలో తీసుకువస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత తెలి పారు.

రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం
మంత్రి టీజీ భరత
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మొట్టమొ దటి స్కిన బ్యాంకు సెంటర్‌ను కర్నూలు రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో త్వరలో తీసుకువస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత తెలి పారు. సోమవారం నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో దివ్యాంగులకు వీల్ చైర్లను మంత్రితో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ పి.రంజిత బాషా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్కిన బ్యాంకులు దేశంలో 12 మాత్రమే ఉన్నా యని, 13వ స్కిన బ్యాంక్ సెంటర్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తున్న రెడ్‌క్రాస్ సొసైటీని అభినం దించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సొసైటీ 2004లో స్థాపించబడిందని, ఇప్పటికే ఐబ్యాంకు సంబంధించి కళ్లను సేకరించడంలో దేశంలోనే కర్నూలు రెండో స్థానంలో ఉందన్నారు. అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన కేజీ గోవిందరెడ్డి మాట్లాడారు. గత 22 ఏళ్లుగా శివరాత్రి, ఉగాది పండుగలకు శ్రీశైలానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తున్న రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులను ఎనజీవోలను మంత్రి, ఎంపీ, కలెక్టర్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులు కే.అరుణ, డా.కేవీ సుబ్బారెడ్డి, డా.విజయకుమార్ రెడ్డి, మధుసూదన, శంకర్ రెడ్డి, వైస్ చైర్మన మహేంద్ర కుమార్ పాల్గొన్నారు.