సిబ్బంది సమస్యలు వింటున్న ఎస్పీ
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:04 AM
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు.

పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం: ఎస్పీ
నంద్యాల క్రైం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. నంద్యాల లోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఎస్పీ చాంబర్‌లో శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పదిమంది పోలీస్ సిబ్బంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీలపై ఎస్పీకి విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తగిన పరిష్కారం, ప్రాధాన్యం కల్పిస్తామని ఎస్పీ భరోసా కల్పించారు. విధి నిర్వహణలో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోకుండా వారి సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారన్నారు.