అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:00 AM
అంబేద్కర్ జీవితాన్ని స్పూర్తిగా తీసుకోవాలని, విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలెక్టర్ రంజిత్‌బాషా సూచించారు. సోమవారం వెల్దుర్తి ఎస్సీ హాస్టల్‌లో అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.

కలెక్టర్ రంజిత్ బాషా
అంబేడ్కర్ జయంతి
వెల్దుర్తి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): అంబేద్కర్ జీవితాన్ని స్పూర్తిగా తీసుకోవాలని, విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలెక్టర్ రంజిత్‌బాషా సూచించారు. సోమవారం వెల్దుర్తి ఎస్సీ హాస్టల్‌లో అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారని, ఆనాడు అంటరానితనం ఎక్కువగా ఉండేదన్నారు. పాఠశాలలో సామాజిక వివక్ష ఎదుర్కొన్నారని, ఉన్నత చదువు అనంతరం అస్పృశ్యత, అంటరానితనం రూపుమాపాలని అందరూ సమానంగా ఉండాలి అనే నినాదంతో పోరాటం మొదలు పెట్టారన్నారు. ప్రభుత్వం ఎస్సీ వసతిగృహాల మరమ్మతులకు రూ.7కోట్లు, బీసీ వసతి గృహాలకు రూ.1.5కోట్లు మంజూరు చేసిందన్నారు. విద్యార్థులకు బహుమతుల ను ప్రదానం చేశారు. అనంతరం వార్డెన్ ఉస్మాన్‌తో కలిసి వసతిగృహం స్టోర్ రూమ్, తరగతి గదులు, వంటశాలను తనిఖీచేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పూర్వ విద్యార్థులైన అనంతపురం రూరల్ సీఐ శేఖర్, ఎస్‌బీఐ ఉద్యోగి ప్రతాప్ అనుభవాలను విద్యార్థులకు తెలియజేశారు. వీరిని కలెక్టర్ సన్మానించారు. జేడీ రంగలక్ష్మీదేవి, ఏఎస్‌డబ్ల్యూవో లీలావతి, ఆర్డీవో సందీప్‌కుమార్, జడ్పీటీసీ సుంకన్న, ఎమ్మార్వో చంద్రశేఖర వర్మ, ఎంఈవో-2 రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ సేవలు మరువలేనివి: సబ్ కలెక్టర్
ఆదోని: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలు మరువలేనివని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి సంద ర్భంగా కార్యాలయంలో నివాళి అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమానికి అంబేద్కర్ చేసిన కృషిని మరువలేనిదని, దూర దృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. మైనార్టీ వెల్పేర్ అధికారి సబిహ పర్వీన్, తహసీల్దార్ శివరాముడు, డీటీ వలిబాషా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, సీనియర్ సహాయకులు రామచంద్ర, ఖాసిం, డీఏవో లక్ష్మోజి పాల్గొన్నారు.
పట్టణంలోని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, నాయకుడు ఉమాపతి నాయుడు నివాళి అర్పించారు. రామస్వామి, సాధికా బేగం, వీరేష్, మల్లికార్జున పాల్గొన్నారు.
ఆదోని టౌన్: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ, వాల్మీకి సాయి ప్రసాద్ రక్తదానం చేశారు. మహదేవ, మల్లిక, రత్నాబాయి, అజయ్ కుమార్, సాయి, శివ, శ్రీకాంత్, తాయన్న పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీలకంఠ నివాళి అర్పించారు. ఎండి బసవరాజస్వామి, కుమారస్వామి, కృష్ణ మురళీధర్ గౌడ్, సాయినాథ్, బాలకృష్ణ, మద్దిలేటి, దాదాభాష పాల్గొన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సత్యవతి ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. టీబీ యూనిట్‌కు సంబంధించిన ఎంపీహెచ్‌ఎస్ బాబురాజు, ఎస్‌వీవో మంజునాథ్, దోరతి, మేరీ, జ్ఞానేశ్వరి, లలితమ్మ, మధు, సుబ్బమ్మ బాయి పాల్గొన్నారు.