తర్తూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:55 PM
ప్రసిద్ధిచెందిన లక్ష్మీరంగనాథస్వామి తర్తూరు జాతర బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.

జూపాడుబంగ్లా, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధిచెందిన లక్ష్మీరంగనాథస్వామి తర్తూరు జాతర బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్వామివారు ఆదివారం భక్తులకు పెళ్లికుమారుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. ముందుగా తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్ దంపతులు రెవెన్యూ కార్యాలయం నుంచి మేళతాళాలతో పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అధికారి సాయికుమార్ దంపతులు తహసీల్దార్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమ ర్పించి పెళ్లికుమారునిగా తయారుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కూరు తహసీల్దార్ రత్నరాధిక, కొత్తపల్లి తహ సీల్దార్ ఉమారాణి, ఆలయ చైర్మన్ నారాయణరెడ్డి, టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లుయాదవ్, రమణా రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, దొరబా బురెడ్డి తదితరులు పాల్గొన్నారు.