స్వర్ణరథంపై ఆది దంపతుల విహారం
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:50 PM
శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వర్ణరథంపై భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు విహరించారు.

శ్రీశైలం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వర్ణరథంపై భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు విహరించారు. స్వర్ణరథాన్ని నేత్రశోభితంగా పుష్పాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు, స్వర్ణరథంపై కొలువుదీరిన స్వామి, అమ్మవార్లకు విశేషపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మహాద్వారం, గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం సాగింది. స్వర్ణరథం ముంగిట కోలాటం, జానపద కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.