Share News

హజ్‌ యాత్రికులకు శిక్షణ

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:09 AM

హజ్‌ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని నేషనల్‌ పీజీ కళాశాలలో ఆదివారం జిల్లాలోని హజ్‌ యాత్రికులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

హజ్‌ యాత్రికులకు శిక్షణ
మాట్లాడుతున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల మున్సిపాలిటీ, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): హజ్‌ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని నేషనల్‌ పీజీ కళాశాలలో ఆదివారం జిల్లాలోని హజ్‌ యాత్రికులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా కలిసిమెలజి జీవించాలని సూచించారు. కార్యక్రమంలో ఇస్లామిక్‌ పండితులు, హజ్‌ సొసైటీ సభ్యులు, హజ్‌ యాత్రికులు పాల్గొన్నారు.

మాజీ కౌన్సిలర్‌కు పరామర్శ

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ కౌన్సిలర్‌ శివశంకర్‌ యాదవ్‌ గాయపడ్డారు. మంత్రి ఫరూక్‌ శివశంకర్‌ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

Updated Date - Apr 07 , 2025 | 01:09 AM