‘సొంతూరిని ఎప్పటికీ మరవకూడదు’
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:14 AM
సొంతూరిని ఎప్పటికీ మరువకూడదని ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకరవ్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు.

జూపాడుబంగ్లా, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): సొంతూరిని ఎప్పటికీ మరువకూడదని ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకరవ్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవరం సందర్భంగా తరిగోపుల గ్రామంలో ఆదివారం క్యాన్సర్ నివారణపై అవగాహన సదస్సును ప్రముఖ క్యాన్సర్ వైద్యులు రవీంద్రబాబు ఏర్పాటు చేశారు. సొంతూరిలోని తరిగోపుల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో రూ.10లక్షలలతో భోజనశాల నిర్మించి, క్యాన్సర్ నివారణ టీకాలు వేయించిన వైద్యుడు రవీంద్రబాబును అభినందించారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే పీ4 కార్యక్రమం ఉద్దేశ్యం కూడా ఇదే తరహాలో ఉందని వారు చెప్పారు. ఓస్థాయిలో సంపాదించుకున్నవారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లుయాదవ్, మార్కెట్ యా్డు చైర్మన్ ప్రసాదరెడ్డి, టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, నారాయణరెడ్డి, దొరబాబురెడ్డి, వెంకటరమణనాయుడు, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మన్నగౌడు, గోరేసాహెబ్, ఖాజీకురైషన్ తదితరులు పాల్గొన్నారు.