Nandyala: మంత్రి ఇంటిపై డ్రోన్ కలకలం
ABN , Publish Date - Jan 16 , 2025 | 09:54 AM
Andhrapradesh: గత రాత్రి మంత్రి ఇంటి పరిసర ప్రాంతాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టింది. అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు ఆ డ్రోన్‌ను గుర్తించారు. వెంటనే అలర్ట్‌ను అయిన సెక్యూరిటీ సిబ్బంది డ్రోన్ ఎవరిదో గుర్తించారు. వైసీపీ నాయకుడు అబ్దుల్ ఫయీజ్ కుమారుడి వివాహం కవరేజ్‌కు వచ్చిన కెమెరామెన్లు ఈ డ్రోన్‌ను ఎగురవేసినట్లు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది..
నంద్యాల జిల్లా, జనవరి 16: జిల్లాలోని బనగానపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది. ఇంటిపై తిరుగుతున్న డ్రోన్‌ను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించింది. డ్రోన్ ఎగురవేస్తున్న వైసీపీ నేత అబ్దుల్ ఫయీజ్ అనుచరులతో టీడీపీ నేతలు గొడవకు దిగారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రాత్రి మంత్రి ఇంటి పరిసర ప్రాంతాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టింది. అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు ఆ డ్రోన్‌ను గుర్తించారు. వెంటనే అలర్ట్‌ను అయిన సెక్యూరిటీ సిబ్బంది డ్రోన్ ఎవరిదో గుర్తించారు.
వైసీపీ నాయకుడు అబ్దుల్ ఫయీజ్ కుమారుడి వివాహం కవరేజ్‌కు వచ్చిన కెమెరామెన్లు ఈ డ్రోన్‌ను ఎగురవేసినట్లు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై వారిని సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. మంత్రి ఇంటిపై డ్రోన్‌ను ఎందుకు ఎగురవేశారని.. ఎగురవేయాల్సిన అవసరం ఏంటి అని సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించారు. అయితే వారు అడిగిన ప్రశ్నకు డ్రోన్‌ను ఎగురవేసిన వ్యక్తులు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడి చేసేందుకు యత్నించారు. విషయం తెలిసిన వైసీపీ శ్రేణులు దీన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఇరువర్గాలకు చెందిన వారు పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వార దర్శనం
వైసీపీ శ్రేణుల తరపున మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి టీడీపీ శ్రేణులపై ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని.. వారిపై కేసు నమోదు చేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించారు. డ్రోన్‌లు ఎందుకు ఎగురవేశారని... ఉద్దేశపూర్వకంగానే మంత్రి ఇంటి ఆవరణలో డ్రోన్‌ను ఎగురవేశారని.. వైసీపీ వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. అయితే బనగానపల్లిలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి వర్గాల మధ్య కొంత కాలంగా వార్ నడుస్తున్న నేపథ్యంలో డ్రోన్ చక్కర్లు కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
రుణాల కోసం పాస్‌పుస్తకాలు అడగొద్దు
Read Latest AP News And Telugu News