ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన మద్యం ధ్వంసం
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:48 PM
ఆత్మకూరు ప్రొహిబిషన అండ్ ఎక్సైజ్ స్టేషన పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని ఆశాఖ అధికారులు ధ్వంసం చేశారు.

ఆత్మకూరు, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు ప్రొహిబిషన అండ్ ఎక్సైజ్ స్టేషన పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని ఆశాఖ అధికారులు ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ప్రొహిబిషన అండ్ ఎక్సైజ్‌శాఖ సూపరిండెంట్ రాముడు సమక్షంలో ఆత్మకూరు పట్టణ శివార్లలో సుమారు 72 కేసుల్లో పట్టుబడిన 200 లీటర్ల నాటుసారా, 99.05లీటర్ల మద్యం, 4146 సీసాల్లోని 362.34 లీటర్ల నాన డ్యూటీఫైడ్ మద్యాన్ని నేలపాలు చేశారు. అసిస్టెంట్ ప్రొహిబిషన అండ్ ఎక్సైజ్‌శాఖ సూపరింతిటెండెంట్ రాముడు మాట్లాడుతూ.. ఎవరైనా నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడితే వదిలే ప్రసక్తే లేదన్నారు. అక్రమ సారా, మద్యం రవాణాపై 9440902585, 9177299067 నంబర్లకు సంప్రదించాలన్నారు.