Nimmanapalli : తండ్రి కాదు...కామ పిశాచి...
ABN, Publish Date - Jan 07 , 2025 | 07:04 AM
కామంతో కళ్లుపొరలు కమ్మి చిన్నారులైన కన్న బిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
పదేళ్ల లోపున్న ఇద్దరు కూతుళ్లపై అఘాయిత్యం
తల్లి ఫిర్యాదుతో అరెస్టు...పోక్సో కేసు నమోదు
నిమ్మనపల్లి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): కామంతో కళ్లుపొరలు కమ్మి చిన్నారులైన కన్న బిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సీఐ రమేశ్‌బాబు తెలిపిన వివరాలు...మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి(28)కి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో నలుగురు ఆడపిల్లలు. అతను దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి 9, 7 ఏళ్ల వయసున్న కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలిసి భార్య వారించింది. అయినా భర్త ధోరణిలో మార్పు రాకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో కూతుళ్లపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడినది వాస్తవమని తేలడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు.
Updated Date - Jan 07 , 2025 | 07:04 AM