Minister Lokesh : ప్రభుత్వం శాశ్వతం..రాజకీయాలు కాదు

ABN, Publish Date - Mar 23 , 2025 | 05:13 AM

‘రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలన్న విషయాన్ని ఇప్పటికైనా జగన్‌రెడ్డి తెలుసుకోవాలి. ప్రభుత్వం శాశ్వతం, రాజకీయాలు కాదన్న విషయాన్ని గుర్తించాలి’ అని మంత్రి లోకేశ్‌ అన్నారు.

Minister Lokesh : ప్రభుత్వం శాశ్వతం..రాజకీయాలు కాదు

అవి ఎన్నికలకే పరిమితం కావాలి: లోకేశ్‌

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలన్న విషయాన్ని ఇప్పటికైనా జగన్‌రెడ్డి తెలుసుకోవాలి. ప్రభుత్వం శాశ్వతం, రాజకీయాలు కాదన్న విషయాన్ని గుర్తించాలి’ అని మంత్రి లోకేశ్‌ అన్నారు. శనివారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ‘ప్రభుత్వం మారినా అభివృద్ధి, సంక్షేమాలు కొనసాగించే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీ విధ్వంస పాలనతో బ్రేక్‌ చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం...టీడీపీ పాలనలో బకాయిలను తాము ఎందుకు చెల్లించాలంటూ మొండికేసింది. టీడీపీ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులను నిలిపివేసింది.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం విద్యాశాఖలో పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.4,271 కోట్లు విడతల వారీగా చెల్లిస్తామని మాట ఇచ్చాం. ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేశాం. తాజాగా రూ.600 కోట్లు విడుదల చేశాం. త్వరలో మరో 400 కోట్లు విడుదల చేస్తాం.’’ అని లోకేశ్‌ తెలిపారు.

Updated Date - Mar 23 , 2025 | 05:13 AM