Pemmasani Chandrashekhar : జగన్ పాలనలో రాష్ట్రానికి చెడ్డపేరు
ABN , Publish Date - Jan 28 , 2025 | 05:40 AM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్ చెడ్డపేరు తీసుకొచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్....

ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు కృషి
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
న్యూఢిల్లీ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్ చెడ్డపేరు తీసుకొచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దావోస్ పర్యటనకు వెళ్లే పరిస్థితి లేదని, వెళ్లినా ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా నాటి ప్రభుత్వ నేతలకు తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై జగన్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. సోమవారం, ఇక్కడ తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెమ్మసాని మాట్లాడారు. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేం దుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పడిన 7-8 నెలలలోనే రాష్ట్రానికి 49 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని, పెట్టుబడుల విలువ రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటాయని అన్నారు. కాగా, గుంటూరు- నల్లపాడును కలిపే పెద్దపలుకలూరు ఆర్వోబీ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపిందని, రూ.41 కోట్లతో నిర్మించే ఈ ఆర్వోబీ నిర్మాణానికి మరో మూడు వారాల్లో టెండర్ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News