ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Savita Slams Jagan: పోలీసులు లేకుంటే గడప దాటగలవా

ABN, Publish Date - Apr 10 , 2025 | 03:27 AM

మంత్రి సవిత జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "పోలీసులే లేకుంటే నీ ఇంటి గడప కూడా దాటగలవా?" అని ప్రశ్నించారు. పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు

పెనుకొండ రూరల్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘పోలీసులే లేకుంటే నీ ఇంటి గడపైనా దాటగలవా? సీఎం సీటులో కూర్చుని పాలించిన నీకు పోలీసులతో ఎలా మాట్లాడాలో తెలియదా’ అని జగన్‌పై మంత్రి సవిత మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పోలీసులను బట్టలూడదీసి కొడతామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేలా, వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. జగన్‌కు శవ రాజకీయాలు అలవాటుగా మారిందని, తన తండ్రి మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారని అన్నారు. పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఘటన బాధాకరమని, బాధ్యులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

Updated Date - Apr 10 , 2025 | 03:27 AM