MLA Vasantha Krishna Prasad: జగన్ ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు.. ఎమ్మెల్యే వసంత ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:26 PM
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా, గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలంలోని పలు గ్రామాలలో సి సి రహదారులను ప్రారంభించిన ఆనంతరం ఆయన మాట్లాడుతూ..

ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ అధినేత వైఎస్. జగన్‌పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పొందుగల, పుల్లూరు, చంద్ర గూడెం గ్రామాలలో సి సి రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే పొందుగలలో నీటి కుంటల నిర్మాణాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓట్లు వస్తే చాలు
జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని కాంట్రాక్టర్లందరూ దివాలా తీశారని, 1.28 లక్షల కోట్లు కాంట్రాక్టర్ లకు చెల్లించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఆలోచించలేదని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలలో జగన్ రహదారులను పట్టించుకోలేదని, బటన్ నొక్కితే చాలు, నాకు ఓట్లు వస్తే చాలు అని భావించాడన్నారు. మాజీ సీఎం వల్ల రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలై పరిపాలనా దిగజారిపోతే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
తొమ్మిది నెలల్లోనే..
ప్రధాని నరేంద్రమోదీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఒక వైపు చేసిన అప్పులకు వడ్డీలు, రోడ్ల నిర్మాణాలతో పాటు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు.
Also Read:
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..
AP Government: అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం.
Somireddy: దమ్ముంటే కాకాణిని అప్పగించండి.. వైసీపీ నేతలకు సోమిరెడ్డి సవాల్