ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Special Trains: పండుగ రోజుల్లో ఈ ట్రైన్స్‌లో ఖాళీలే ఖాళీలు.. త్వరపడండి..

ABN, Publish Date - Jan 07 , 2025 | 10:02 AM

కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం వరకు నడపనున్న ప్రత్యేక రైళ్లల్లో ఇంకా వందల సంఖ్యలో బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. పండుగ రోజుల్లో ఊరు వెళ్లాలనుకునేవారికి నిజంగా ఇది పండుగలాంటి వార్తగానే చెప్పుకోవాలి. జనవరి 14, 15 తేదీల్లో మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వైపు వెళ్లాలంటే ఎలాంటి చింత అవసరం లేదు. జనరల్ కేటగిరీలో వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి.

Trains

పండుగకు ఊరు వెళ్తున్నారా.. ట్రైన్లు, బస్సుల్లో సీట్లు దొరకడం లేదా.. ప్రయివేట్ బస్సుల్లో టికెట్లు కొనలేకపోతున్నారా.. మీ కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. స్పెషల్ ట్రైన్స్‌లోనూ విడుదల చేయగానే సీట్లు, బెర్తులు బుక్ అయిపోతున్నాయి. అయినా సరే కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం వరకు నడపనున్న ప్రత్యేక రైళ్లల్లో ఇంకా వందల సంఖ్యలో బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. పండుగ రోజుల్లో ఊరు వెళ్లాలనుకునేవారికి నిజంగా ఇది పండుగలాంటి వార్తగానే చెప్పుకోవాలి. జనవరి 14, 15 తేదీల్లో మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వైపు వెళ్లాలంటే ఎలాంటి చింత అవసరం లేదు. జనరల్ కేటగిరీలో వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఉన్న స్థితిగతులు చూస్తే జనవరి 14వ తేదీన చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య నడిచే రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్ కోచ్‌లలో ఖాళీలు ఉన్నాయి. జనవరి 15వ తేదీన కాచిగూడ - శ్రీకాకుళం మధ్య నడిచే ఏసీ రైలులోనూ సీట్లు ఖాళీ ఉన్నాయి. రెగ్యులర్ ట్రైన్స్‌లో చాంతాడంట వెయిటింగ్ లిస్ట్ ఉండగా.. కొన్ని ప్రత్యేక రైళ్లల్లో మాత్రం ఇంకా బెర్తులు అందుబాటులో ఉన్నాయి.


చర్లపల్లి - శ్రీకాకుళం రైలులో

సంక్రాంతి పండుగ నేపథ్యంలో భారతీయ రైల్వే చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు ప్రత్యేక రైలు నడుపుతోంది. మంగళ, గురు, ఆదివారాల్లో నడిచే ఈ రైలులో జనవరి 14వ తేదీన బెర్తులు ఖాళీగా ఉన్నాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో 14వ తేదీ రాత్రి 7.20 గంటలకు బయలుదేరే ఈరైలు 15వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం జంక్షన్, చీపురుపల్లి, పొందూరు మీదుగా ఈ రైలు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ తరగతులు ఈరైలులో అందుబాటులో ఉండగా మంగళవారం (7 జనవరి 2025) ఉదయం 9.30 గంటల పమయానికి స్లీపర్ క్లాస్‌లో 400 బెర్తులు అందుబాటులో ఉండగా.. ఏసీ త్రీటైర్‌లో 148, ఏసీ టు టైర్‌లో 60, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో నాలుగు బెర్తులు అందుబాటులో ఉన్నాయి.


కాచిగూడ- శ్రీకాకుళం

భారతీయ రైల్వే కాచిగూడ- శ్రీకాకుళం రోడ్ మధ్య జనవరి 15వ తేదీన కూడా ఏసీ ప్రత్యేక రైలు నడపనుంది. దీనికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు జనవరి 15వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. ఈ రైలు మల్కజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం జంక్షన్, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతూ శ్రీకాకుళం చేరుకుంటుంది. ఈరైలులో కేవలం ఏసీ త్రీ టైర్ బెర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మంగళవారం (7 జనవరి 2025) ఉదయం 9.30 గంటల పమయానికి థర్డ్‌ ఏసీలో వెయ్యికి పైగా బెర్తులు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 07 , 2025 | 10:02 AM