బీసీల అభ్యున్నతికి కృషి చేసేది టీడీపీయే: పల్లా
ABN, Publish Date - Jan 01 , 2025 | 05:23 AM
బీసీల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
విశాఖపట్నం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): బీసీల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ నాయకులు, అధికారులకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇప్పటికే డీజీపీగా మరో బీసీ వ్యక్తి ద్వారకా తిరుమలరావును నియమించింది. టీటీడీ ఈవోగా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్యామలరావు ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్‌నాయుడుకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి కూటమి ప్రభుత్వం ప్రోత్సహించింది. బీసీ అయిన నన్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబ నియమించి గౌరవాన్ని ఇచ్చారు. 60 శాతం పదవుల్లో బీసీలకు అవకాశం కల్పిస్తోంది’ అని పల్లా అన్నారు.
Updated Date - Jan 01 , 2025 | 05:23 AM