Paritala Suneetha: పరిటాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం

ABN, Publish Date - Apr 04 , 2025 | 04:39 AM

: ఎమ్మెల్యే పరిటాల సునీత, పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య మరణ ఘటన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేసారు. పారిశ్రామిక రాజకీయాల నేపథ్యంలో పరితాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం ఉందని ఆమె వ్యాఖ్యానించారు

Paritala Suneetha: పరిటాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం
  • కారు, సూట్‌ కేసు బాంబుల గురించి ఆయనకు బాగా తెలుసు

  • 45 హత్యలకు సమాధానం చెప్పి జిల్లాలో అడుగుపెట్టాలి

  • ఒక్క లింగమయ్య కుటుంబాన్నే కాదు.. తోపుదుర్తి సోదరుల బాధితులనూ పరామర్శించాలి

  • జగన్‌పై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం

అనంతపురం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య వెనుక వైసీపీ అధినేత, జగన్‌ హస్తం ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో జగన్‌ను సీబీఐ విచారించిందని గుర్తుచేశారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి ఘటన నేపథ్యంలో జగన్‌ అనంతపురం జిల్లాకు వస్తుండటంపై ఆమె తీవ్రస్థాయిలో స్పందించారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. పాపిరెడ్డిపల్లిలో జరిగిన అనుకోని సంఘటనలో లింగమయ్య చనిపోవడం బాఽధాకరమని, ఆ ఘటన తమ కుటుంబాన్ని ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్‌ మంగళవారం జిల్లాకు వస్తానంటున్నారు. నా సూచన ఏమిటంటే.. మంగళవారం కాకుండా శుక్రవారం వస్తే ఆయనకు అచ్చొస్తుంది’ అని ఎద్దేవా చేశారు. జగన్‌కు కారు, సూట్‌కేసు బాంబుల గురించి బాగా తెలుసని, అప్పట్లోనే పరిటాల రవిని హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పరిటాల రవి హత్య వెనుక జగన్‌ హస్తం ఉందని పునరుద్ఘాటించారు. ‘జిల్లాలో 45 మందిని పొట్టనపెట్టుకున్న చరిత్ర మీకు ఉంది. జిల్లాకు వచ్చే ముందు వాటికి సమాధానం చెప్పి జిల్లాలో అడుగుపెట్టాలి’ అని జగన్‌ను డిమాండ్‌ చేశారు.


‘ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలు రేపేందుకు వస్తున్నారా.. మా ప్రాంతం ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా..?’ అని నిలదీశారు. ఒక్క లింగమయ్య కుటుంబమే కాదు... జగన్‌ పరామర్శించాల్సిన బాధితులు చాలామందే ఉన్నారని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తోపుదుర్తి సోదరులు సాగించిన అరాచకాలు, దౌర్జ్జన్యాలకు బలైన బాధిత కుటుంబాలు అనేకం ఉన్నాయని.. వారందిరినీ జగన్‌ పరామర్శించాలని సూచించారు. అందుకే జిల్లాకు వచ్చేటప్పుడు సూట్‌కేసు నిండా దుస్తులు పెట్టుకొని రావాలని అన్నారు. ఒక్క గ్రామంలో జరిగిన సంఘటను ఫ్యాక్షన్‌గా చిత్రీకరించి పరామర్శించేందుకు జిల్లాకు వస్తున్నారని, ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేసే అంశాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.

ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:40 AM