మినీ అంగన్‌వాడీలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:06 AM
మినీ అంగన్‌వాడీలను మెయిన్ కేంద్రాలుగా మార్చి సమస్యను పరిష్కరించాలని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు స్ర్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కోరారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలోని సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

అద్దంకిటౌన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : మినీ అంగన్‌వాడీలను మెయిన్ కేంద్రాలుగా మార్చి సమస్యను పరిష్కరించాలని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు స్ర్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కోరారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలోని సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తగా జనరేట్ చేసిన యాప్‌తో కలిగే సమస్యలు, అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాల అమలుతో పాటు మేలో కేంద్రాలకు సెలవులు ఇప్పించాలని కోరారు. అంగన్‌వాడీలకు ఇబ్బంది లేకుండా యాప్‌ల పనిభారాన్ని తగ్గిస్తామని, కొత్త సెల్ ఫోన్లు ఇవ్వనున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. కార్యక్రమంలో తెలుగునాడు అంగన్‌వాడీ ట్రెడ్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఆచంట సునీత, రాష్ట్ర అధ్యక్షురాలు గడ్డం అనంతలక్ష్మి, జనరల్ సెక్రటరీ కొల్లి లక్ష్మీ నరసమ్మ, ట్రెజరర్ కొడాలి హేమలత, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బండారు కల్యాణి పాల్గొన్నారు.