అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:49 AM
వేసవి ఎండలు పెరిగాయని, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువని, వాటి నివారణకు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎర్రగొండపాలెం అగ్నిమాపక కేంద్రం, పైర్ అధికారి మాల్యాద్రి అన్నారు.

ఎర్రగొండపాలెం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) వేసవి ఎండలు పెరిగాయని, అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువని, వాటి నివారణకు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎర్రగొండపాలెం అగ్నిమాపక కేంద్రం, పైర్ అధికారి మాల్యాద్రి అన్నారు. ఎర్రగొండపాలెం అగ్నిమాపక కేంద్రంలో సోమవారం అగ్నిమాపక వారోత్సవాల పోస్టరును ఆవిష్కరించారు. ఏటా ఎప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజులు వారోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం విషయం తెలియగానే అగ్నిమాపక కేంద్రానికి పోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో పి ఆం జనేయులు, అగ్నిమాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మార్కాపురం వన్‌టౌన్ : వేసవిని దృష్టిలో ఉంచుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త లు తీసుకోవాలని డీఎస్పీ నాగరాజు అన్నారు. స్థానిక అగ్నిమాపక కా ర్యాలయంలో సోమవారం ఆయ న అగ్నిమాపక వారోత్సవాలు ప్రారం భించారు. అగ్నిమాపక సాధనాలు పరిశీలిం చారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
అగ్నిమాపక వారోత్సవాలు
కంభం : కంభం అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అగ్నిమాపక కేంద్రం ఆవరణలో కరపత్రా లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభు త్వ వైద్యశాల సూపరింటెండెంట్ శిరీష, అగ్నిమాపక అధికారి పిచ్చయ్యచౌదరి, సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల గురించి, నివారణ చర్యలను వివరించారు.