వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:36 AM
ప్రస్తుతం వేసవిలో రోజురోజుకు ఎండలు ముదురుతుండడంతో గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఆయా గ్రామప్రజా ప్రతినిధులు, సంబంధిత పంచాయతీ అధి కారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో వీరభద్రాచారి సూచించారు.

కంభం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం వేసవిలో రోజురోజుకు ఎండలు ముదురుతుండడంతో గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఆయా గ్రామప్రజా ప్రతినిధులు, సంబంధిత పంచాయతీ అధి కారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో వీరభద్రాచారి సూచించారు. బుధ వారం ఎంపీడీవో అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఏప్రిల్, మే నెలల్లో ఎండలతీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతా వరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. కంభం చెరువులో నీరు అడుగంటుతోందని, భూగర్భజలాలు అడు గంటి బోర్లలో నీరు సక్రమంగా రాక ఇబ్బం దులు పడాల్సి వస్తోందన్నారు. కావున ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నీటిసమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకో వాలని కోరారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పశువు లకు నీటి కొరకు మండలం లో 35 నీటితొట్లను నిర్మిస్తు న్నట్లు, గతంలో నిర్మించిన తొట్లకు మరమత్తులు చేసి వినియోగంలోకి తేవాలన్నా రు. సర్పంచ్ బోడయ్య మాట్లాడుతూ ఇరిగే షన్ పంటకాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం వలన మురికి కాలువలు గా మారిపోయాయని, కొన్నిచోట్ల తీసిన చెత్తను గట్లపైనే ఉంచారన్నారు. 3నెలలైనా తొలగించలేదని, ఆ చెత్త తిరిగి కాలవలోనే పడుతుందన్నారు. లక్షల రూపాయలు నిధులు మంజూరవుతున్నా ఆ నిధులు ఏమవుతున్నాయో అర్ధం కావడం లేదన్నారు. సమావేశంలో తహసిల్దార్ కిరణ్, ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ, జడ్‌పిటిసి కొత్తపల్లి జ్యోతి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.