Share News

Prabhavati Investigation: ఎవరి పేరు చెప్తారో ఏంటో

ABN , Publish Date - Apr 04 , 2025 | 06:11 AM

రఘురామ కృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో, గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌ ప్రభావతి విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఆమెపై ఒత్తిడి చేసిన నేతలు, తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ చేయడంపై దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులో ఆ నేతకు కూడా సంబంధాలున్నాయి

Prabhavati Investigation: ఎవరి పేరు చెప్తారో ఏంటో

  • 7, 8 తేదీల్లో విచారణకు హాజరుకానున్న గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌ ప్రభావతి

  • రఘురామ ఒంటిపై గాయాలు లేవని తప్పుడు ధ్రువీకరణ.. ఎవరు ఒత్తిడి చేశారో పేర్లు చెబుతారని నేతల్లో ఆందోళన

గుంటూరు, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌ ప్రభావతి ఈ నెల 7, 8 తేదీల్లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. దీంతో రఘురామ ఒంటిపై గాయాల విషయంలో తప్పుడు ధ్రువీకరణపత్రం జారీచేయడంపై ఎవరి పేరు చెబుతారోనని నాడు ఆమెను ఒత్తిడి చేసిన నేతలు కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో వైసీపీ ఎంపీగా ఉన్న ఓ నేతతో ఆమె భర్త రవికుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన పేరు చెప్పే అవకాశం లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ నేత కూటమి తరఫున ఎంపీగా ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రం ఇవ్వటంలో ఆయన ఒత్తిడి కూడా ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇదే సమయంలో నాడు షాడో సీఎంగా చెలామణి అయిన ప్రభుత్వ సలహాదారు నుంచి కూడా ఆమెకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రభావతి ‘ఆయన’ పేరు చెప్పినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాడు రఘురామను కొట్టించడమే కాకుండా.. వీడియో కాల్‌లో ఆ దృశ్యాలను నేరుగా తిలకించి, ఆనందించారనే అభియోగం కూడా ఆ వైసీపీ కీలక నేతపై ఉంది. ఈ కేసులో ఏ5గా నిందితురాలుగా ఉన్న ప్రభావతి ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.


అయితే ఆమె విచారణకు సహకరించటం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 7, 8 తేదీల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై, విచారణకు సహకరించాలని ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాటి వైసీపీ ప్రభుత్వంపై తనకున్న మమకారంతో రఘురామ ఒంటిపై గాయాలు ఉన్నా కూడా.. లేవని సూపరింటెండెంట్‌ హోదాలో తప్పుడు ధ్రువీకరణ పత్రం ఇవ్వటంలో ప్రభావతి కీలకపాత్ర పోషించారనే ఆరోపణతో కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ సీఎం జగన్‌పైనా నగరంపాలెం పోలీ స్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పోస్టు విషయంలో సహకరించిన వైసీపీ పెద్దల రుణం తీర్చుకునేందుకు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ప్రభావతి చిక్కుల్లో చిక్కుకున్నారని, ఆ తప్పు ఇప్పుడు వెంటాడుతోందనే ప్రచారం జరుగుతోంది.


ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 06:11 AM