RGV: ఎట్టకేలకు పోలీస్ స్టేషన్‌కు ఆర్జీవీ

ABN, Publish Date - Feb 06 , 2025 | 07:04 PM

డెరెక్టర్ రాంగోపాల్ వర్మపై ఒంగోలులో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పలుమార్లు విచారణకు రావాలని అధికారులు నోటీసులు పంపిన ఆర్జీవీ విచారణకు హాజరుకాలేదు. అయితే, ఎట్టకేలకు..

RGV: ఎట్టకేలకు పోలీస్ స్టేషన్‌కు ఆర్జీవీ
RGV

RGV: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు డెరెక్టర్ రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం ఒంగోలు జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి నోటీసులు పంపారు. అయితే, తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టు‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

ఇటీవల ఫిబ్రవరి 4న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా ఈనెల 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఎట్టకేలకు రామ్‌గోపాల్ వర్మ రేపు ఒంగోలు పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. విచారణాధికారి సీఐ శ్రీకాంత్‌కు రేపు విచారణకు వస్తున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చారు.

Updated Date - Feb 06 , 2025 | 07:13 PM