సీఐడీ నోటీసులపై హైకోర్టుకు ఆర్జీవీ
ABN , Publish Date - Mar 05 , 2025 | 07:36 PM
సీఐడీ నోటీసులపై డెరెక్టర్ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విషయంపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో ఆర్జీవీపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.

RGV: సీఐడీ నోటీసులపై డెరెక్టర్ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆర్జీవీ సినిమా తీశారంటూ పలు చోట్ల సీఐడీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో ఆర్జీవీపై కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి సీఐడీ నోటీసులు పంపింది. అయితే, ఆయన దీనిని హైకోర్టులో సవాల్ చేశారు.