Share News

వాహనాలపైకి దూసుకెళ్లిన ఇసుక ట్రాక్టర్‌

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:44 AM

కృష్ణానది కరకట్ట రహదారి వెంబడి ఉన్న సిమెంట్‌ బల్లలు, తాటిపట్టెలపై కూ ర్చున్న వ్యక్తులు, ద్విచక్ర వాహనాలపైకి వేగంగా ఇసుక ట్రా క్టర్‌ దూసుకుని రావటంతో ఏడుగురికి గాయాలైన ఘటన మోపిదేవి మండలంలోని కె.కొత్తపాలెం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది.

వాహనాలపైకి దూసుకెళ్లిన ఇసుక ట్రాక్టర్‌

మోపిదేవి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కృష్ణానది కరకట్ట రహదారి వెంబడి ఉన్న సిమెంట్‌ బల్లలు, తాటిపట్టెలపై కూ ర్చున్న వ్యక్తులు, ద్విచక్ర వాహనాలపైకి వేగంగా ఇసుక ట్రా క్టర్‌ దూసుకుని రావటంతో ఏడుగురికి గాయాలైన ఘటన మోపిదేవి మండలంలోని కె.కొత్తపాలెం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో వర్క్‌ ఫ్రమ్‌ సర్వే చేస్తున్నారు. కె.కొత్తపాలెం గ్రామ సచివాల య ఉద్యోగులు కరకట్ట దిగువనున్న పలు కుటుంబాల సర్వే నిమిత్తం వెళ్లారు. గ్రామస్థులు మధ్యాహ్నం చెట్ల కింద సేదతీరుతూ కూర్చున్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం వైపు నుంచి ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ వేగంగా వెళ్తూ అదుపు తప్పి కరకట్టపై ఉన్న గ్రామస్థుల వాహనాలు, చెట్ల కింద కూర్చున్న వ్యక్తులను ఢీకొట్టి దిగువకు వెళ్లింది. ఈ ఘ టనలో పడమటి నాగరాజు, పడమటి రాఘవేంద్రరావు, పడమటి మాణిక్యాలరావు, పడమటి రాధాకృష్ణ, పడమటి ఫణీంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లవోలు నాగ అశోక్‌, పడమటి నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్థులు స మాచారంతో 108 అంబులెన్స్‌లో గాయాలపాలైన ఏడుగురు వ్యక్తులను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయాలైన ఐదుగురిని మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మోపిదేవి ఎస్‌ఐ వైవి.సత్యనారాయణ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 08 , 2025 | 12:44 AM