Steel Plant Boost: ఉక్కుకు ఊపిరి
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:26 AM
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊపిరి పోసేలా ఎస్‌బీఐ వడ్డీ రేటును 14 శాతం నుంచి 9 శాతానికి తగ్గించి రుణాలను పునర్‌వ్యవస్థీకరించింది. కేంద్ర ప్యాకేజీతో ముడిపదార్థాల కొరత తీరిపోవడంతో ఉత్పత్తి పూర్తిస్థాయిలో సాగుతోంది

రుణాల సర్దుబాటుకు ఎస్‌బీఐ ఓకే
వడ్డీ 14 నుంచి 9 శాతానికి తగ్గింపు
కేంద్ర ప్యాకేజీతో మారిన పరిస్థితి
2 బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా పూర్తిస్థాయి ఉత్పత్తి..
జూన్‌లో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభం!
విశాఖపట్నం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊపిరి పోసే ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవ, కేంద్ర సహకారంతో కష్టాల నుంచి గట్టెక్కుతోంది. తాజాగా... విశాఖ ఉక్కుకు సంబంధించిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించి, వడ్డీ రేట్లు తగ్గించాలన్న ప్రతిపాదనపై లీడ్‌బ్యాంక్‌గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బోర్డు ఆమోద ముద్ర వేసింది. స్టీల్ ప్లాంటు రుణాలను రీస్ట్రక్చర్ చేసింది. వడ్డీ రేట్లను 14 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది. దీంతో స్టీల్ ప్లాంటుకు వడ్డీల భారం బాగా తగ్గింది. స్టీల్ ప్లాంటు 2024-25 ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణభారం రూ.20 వేల కోట్లను దాటేసింది. బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి వచ్చింది. ప్రధాన ముడి పదార్థాలైన ఐరన్‌ఓర్, కోకింగ్ కోల్ అవసరమైనంత అందుబాటులో లేక పూర్తిస్థాయిలో ప్లాంటు నడవలేదు. మూడు బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఒకదానిని పూర్తిగా మూసివేయగా, మిగిలిన రెండింటిని అరకొరగా నడుపుతూ రోజుకు ఏడు నుంచి ఎనిమిది వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే చేసేవారు. సంస్థను ఆదుకోవాలని కార్మిక సంఘాలు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్థించగా, ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధానితో, కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. అనేక చర్చల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. రూ.11,440 కోట్లు సాయం చేసింది. అందులో నుంచి రూ.6వేల కోట్లను రుణాలు తీర్చేందుకు కేటాయించడంతో... రుణాల రీస్ట్రక్చర్‌కు అవకాశం కలిగింది.
పూర్తిస్థాయిలో ఉత్పత్తి
విశాఖ ఉక్కు కర్మాగారానికి బ్యాంకులన్నీ అవసరమైనంత వరకు రుణాలు ఇస్తుండటంతో ముడి పదార్థాల కొరత తీరిపోయింది. అక్టోబరు నుంచి రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. రోజుకు 14 వేల టన్నుల ఉక్కు ఉత్పత్తితో... పూర్తి సామర్థ్యంతో ప్లాంటు పనిచేస్తోంది. మూతపడిన మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌ను కూడా జూన్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అవసరమైన ముడి పదార్థాలను అందించాలని ఎన్‌ఎండీసీని కేంద్రం ఆదేశించింది. అదే విధంగా మార్కెటింగ్ వ్యవహారాల్లో సహాయం చేయాలని సెయిల్‌కు సూచించింది. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ ఉక్కుకు అండగా నిలిచాయి. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయాలని, 7.3 మిలియటన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉద్యోగుల సంఖ్య తగ్గింపు
సంస్థ వ్యయాల నియంత్రణకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నారు. సుమారు 1,200 మందికి వీఆర్‌ఎస్ ఇచ్చి మార్చి నెలాఖరున పంపించేశారు. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య తగ్గించేలా... కాంట్రాక్ట్‌లను రెన్యువల్ చేయకుండా నిలిపివేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Dy Collectors Transfer: భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే..
National Herald Case: ఈడీ ఛార్జ్‌షీట్లో సోనియా, రాహుల్ పేర్లు
BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త
Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..
PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
Hyderabad Summit:హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ..
For AndhraPradesh News And Telugu News