ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Transport Department : పరివాహన్‌తో పరేషాన్‌

ABN, Publish Date - Jan 10 , 2025 | 05:18 AM

రాష్ర్టానికి చెందిన లారీ యజమానులకు ఒడిశా రవాణా శాఖ అధికారులు షాక్‌ ఇచ్చారు. అన్ని అనుమతులు, చట్టబద్ధమైన రికార్డులు ఉన్నప్పటికీ 200కు పైగా లారీలపై ‘పరివాహన్‌’ డేటాబే స్‌లో వివరాలు కనిపించటం లేదన్న పేరుతో కేసులు నమోదు చేశారు.

  • ఏపీ లారీలకు ఒడిశా రవాణా అధికారుల షాక్‌!

  • పరివాహన్‌లో కనిపించటం లేదని కేసులు...

  • రవాణా శాఖ కమిషనర్‌ను కలిసిన ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌

విజయవాడ, జనవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ర్టానికి చెందిన లారీ యజమానులకు ఒడిశా రవాణా శాఖ అధికారులు షాక్‌ ఇచ్చారు. అన్ని అనుమతులు, చట్టబద్ధమైన రికార్డులు ఉన్నప్పటికీ 200కు పైగా లారీలపై ‘పరివాహన్‌’ డేటాబే స్‌లో వివరాలు కనిపించటం లేదన్న పేరుతో కేసులు నమోదు చేశారు. అంతేకాదు ఏకంగా కోర్టుకు పెట్టడంతో ఏపీ లారీ యజమానులు లబోదిబో మంటున్నారు. దీంతో ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ (ఏపీఎల్‌ఓఏ) రంగంలోకి దిగింది. గురువారం ఏపీఎల్‌ ఓఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు మరికొందరు సంఘ నేతలు రవాణా శాఖ కమిషనర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రావాణా సేవలను ఈ - ప్రగతి ద్వారా అందించారు. కొంతకాలం కిందట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏకీకృత ఆన్‌లైన్‌ సేవలను అందించేందుకు వీలుగా ‘పరివాహన్‌’ పోర్టల్‌ను ఆవిష్కరించింది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలలో పరివాహన్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మిగిలిన చోట్ల ఈ ప్రగతి అమల్లో ఉండేది. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఈ ప్రగతిని నిలిపివేశారు. పరివాహన్‌ ద్వారానే సేవలందిస్తున్నారు.


ఈ క్రమంలో ఈ ప్రగతిలో ఉన్న వాహన డేటా అంతా పరివాహన్‌ సైట్‌లోకి అప్‌లోడ్‌ కాలేదు. ఏపీకి చెందిన వాహన డేటా పరివాహన్‌లోకి అప్‌లోడ్‌ కాకపోవటంతో ఆ లారీలు బోర్డర్‌ దాటినపుడు.. ఒడిశా రవాణా శాఖ అధికారులు నంబర్‌ ప్లేట్లను స్కాన్‌ చేస్తున్నారు. పరివాహన్‌లోకి డేటా అప్‌లోడ్‌ కాలేదు కాబట్టి వారికి ఎటువంటి సమాచారం రావడం లేదు. దీంతో అనుమానంతో లారీలపై కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న తర్వాత లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో వాహనాల పూర్తి వివరాలను రవాణా శాఖ అధికారులకు సమర్పించి ఈ ప్రగతిలోని డేటాను పరివాహన్‌లోకి అప్‌లోడ్‌ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించలేదు. ఈ నేపథ్యంలో రవాణా కమిషనర్‌కు మొరపెటుకోగా.. ఓడిశా రవాణా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - Jan 10 , 2025 | 05:20 AM