Share News

Srikakulam : పింఛన్‌ సొమ్ముతో సర్వేయర్‌ పరార్‌

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:14 AM

పెంట గ్రామ సచివాలయ సర్వేయర్‌ చదువుల భానుప్రతాప్‌.. ఈ నెలకు సంబంధించిన రూ.49 వేల పింఛన్‌ సొమ్ముతో పరారీ అయ్యారు.

Srikakulam : పింఛన్‌ సొమ్ముతో సర్వేయర్‌ పరార్‌

  • తహసీల్దార్‌, ఎంపీడీవోకు సచివాలయ సిబ్బంది ఫిర్యాదు

జి.సిగడాం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెంట గ్రామ సచివాలయ సర్వేయర్‌ చదువుల భానుప్రతాప్‌.. ఈ నెలకు సంబంధించిన రూ.49 వేల పింఛన్‌ సొమ్ముతో పరారీ అయ్యారు. దీనిపై సచివాలయం సిబ్బంది సోమవారం తహసీల్దార్‌ ఎం.శ్రీకాంత్‌, ఎంపీడీవో రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. ‘సర్వేయర్‌ భానుప్రతా్‌ప ఈ నెల 44 మంది లబ్ధిదారుల పింఛన్ల మొత్తం రూ.1.66 లక్షలకుగానూ రూ.1.17 లక్షలు పంపిణీ చేశారు. మిగిలిన రూ.49 వేలతో పరారీ అయ్యారు. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా సొంతంగా రూ.33 వేలు సర్దుబాటు చేసి పంపిణీ చేశాం’ అని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేస్తామని తహసీల్దార్‌, ఎంపీడీవో తెలిపారు.

Updated Date - Feb 18 , 2025 | 05:14 AM