Arrest: పాస్టర్‌ను తరిమేయాలని..
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:09 AM
Internal church politics ‘వృత్తిలో ఉన్నవారితోనే శత్రుత్వం’ అన్న చందంగా ఓ పాస్టర్ వ్యవహరించాడు. మరో పాస్టర్‌ను ఊరి నుంచి తరిమేసి.. ఆ గ్రామంలో చర్చి నిర్మాణం ఆపేయాలని దుష్టపన్నాగం పన్నాడు. ఈ క్ర మంలో గత నెల 29, 30 తేదీల్లో జలుమూరు మండలం యలమంచిలితో పా టు చుట్టుపక్కల గ్రామాల్లో హిందూ దేవాలయాల ప్రహరీలపై అన్యమత ప్రచారం చేశాడు. ఆ తప్పును మరో పాస్టర్‌పై నెట్టేందుకు పథకం రచించాడు. ఇంతవరకు మత ఘర్షణలులేని జిల్లాలో ఈ విషయమై చిచ్చురేగింది.

మరో పాస్టర్ దుష్టపన్నాగం
హిందూ దేవాలయాల గోడలపై అన్యమత ప్రకటనలు
ప్రజల దృష్టి మళ్లించి.. చర్చి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నం
ముగ్గురు అరెస్టు: ఎస్పీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ‘వృత్తిలో ఉన్నవారితోనే శత్రుత్వం’ అన్న చందంగా ఓ పాస్టర్ వ్యవహరించాడు. మరో పాస్టర్‌ను ఊరి నుంచి తరిమేసి.. ఆ గ్రామంలో చర్చి నిర్మాణం ఆపేయాలని దుష్టపన్నాగం పన్నాడు. ఈ క్ర మంలో గత నెల 29, 30 తేదీల్లో జలుమూరు మండలం యలమంచిలితో పా టు చుట్టుపక్కల గ్రామాల్లో హిందూ దేవాలయాల ప్రహరీలపై అన్యమత ప్రచారం చేశాడు. ఆ తప్పును మరో పాస్టర్‌పై నెట్టేందుకు పథకం రచించాడు. ఇంతవరకు మత ఘర్షణలులేని జిల్లాలో ఈ విషయమై చిచ్చురేగింది. హిందూ సంస్థలు.. ఇతరత్రా ప్రజలు.. ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ మహేశ్వరరెడ్డి ప్రత్యేక బృందాలను నియమించి ఈ కేసును ఛేదించారు. ఈ పన్నాగంలో పాస్టర్‌తోపాటు ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యా లయంలో నిందితులను ప్రవేశపెట్టి కేసు పూర్వాపరాలను ఎస్పీ వివరించారు.
ఏమి జరిగిందంటే..
జలుమూరు మండలం యలమంచిలిలో చొక్కాపు శంకరరావు గత రెండే ళ్లుగా పాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల యలమంచిలిలో చర్చిని నిర్మించేం దుకు 30 సెంట్ల భూమిని స్వామి అనే వ్యక్తి సేకరించారు. ఆ స్థలంలో చర్చి నిర్మిస్తే.. పాస్టర్‌గా శంకరరావే కొనసాగుతారు. యలమంచిలికి ఆనుకుని ఉన్న బుడితి(సారవకోట మండలం)లో చర్చి ఉంది. ఈ చర్చికి కొంతమంది క్రైస్త వులు మాత్రమే వెళ్తుంటారు. అధికమంది యలమంచిలిలోని చర్చిలో ప్రార్థనల కు హాజరవుతుంటారు. యలమంచిలిలో చర్చి నిర్మాణం పూర్తయితే బుడితి చర్చికి వచ్చేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందని.. కానుకలు కూడా లభించవని బుడితి చర్చి పాస్టర్ చందక దేముడు నాయుడు అలియాస్ జాన్ పీటర్(39) అసూయ చెందాడు. ఎలా అయినా సరే చర్చి నిర్మాణం జరగకుండా యలమం చిలిలో ఉన్న పాస్టర్ శంకరరావును తరిమేస్తే... క్రైస్తవులు తాను ఉన్న చర్చికే వస్తారని దుష్టపన్నాగం పన్నాడు. ప్రజల్లో శంకరరావుపై కోపం తెప్పిస్తే.. తన లక్ష్యం నెరవేరుతుందని భావించాడు. ఈ విషయమై తన సన్నిహితుడు పాగోటి ఈశ్వరరావుతో సంప్రదించాడు. ఈశ్వరరావు తన చిన్ననాటి మిత్రుడైన కాకినాడ జిల్లా ఏళేశ్వరం మండలం అన్నవరం గ్రామానికి చెందిన మామిడి అజయ్(33) ను తీసుకువచ్చి పరిచయం చేశాడు. ఈ ముగ్గురూ కలిసి.. హిందూ దేవాలయాలపై అన్యమత ప్రచారప్రకటనలు రాసి.. ఆ నేరాన్ని తెలివిగా శంకరరావుపై నెట్టేలా చేద్దామని ప్రణాళిక వేసుకున్నారు. మార్చి 29న రాత్రి ఈ ముగ్గురూ సమావేశమై.. యలమంచిలిలోని ఎండల కామేశ్వరస్వామి ఆలయం లోపల ప్రహరీపై ‘ఏసుక్రీస్తు బోధనలు’ రాశారు. తర్వాత సమీపం లో ఉన్న అసిరితల్లి ఆలయ గోడలపై శిలువ గుర్తు వేశారు. ఆ తర్వాత కామినాయుడిపేట ఆంజనేయ స్వామి ఆలయం గోడపై, కొండపోలవలస ఆంజేయస్వామి ఆలయం గోడలపైనా ఏసుప్రభువును కీర్తిస్తూ... శిలువ గుర్తులు వేశారు. జాగ్రత్తగా ఎవరూ గమనించకుండా పరారయ్యారు. స్థానికంగా ఉండే పాస్టర్ శంకర రావుపైనే ప్రజలకు అనుమానం వచ్చేలా ఇదంతా చేశారు. ప్రజలు మార్చి 30న సాయంత్రం ఆలయాలపై ఈ రాతలు చూసి.. హిందూ సంస్థలు, ఇతర సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులకు ఫిర్యా దు చేయగా కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మత ఘర్షణలు చెలరేగకుండా ఎస్పీ ఆధ్వర్యంలో కఠినచర్యలు ప్రారంభ మయ్యాయి. అదేరీతిన ఏఎస్పీ శ్రీనివాస రావు, నరసన్నపేట, టెక్కలి, కొత్తూ రు సీఐలతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. వీళ్లు సాంకేతికంగానూ.. గ్రామాల్లో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశారు.
గూగుల్ టైమ్ ఔట్‌ను వాడకపోయినా.. పట్టుబడ్డారు
నిందితులు పాగోటి ఈశ్వరరావు, జాన్ పీటర్, మామిడి అజయ్ తెలివిగా వ్యవహరించారు. పాస్టర్ జాన్ పీటర్‌కు డైరీ రాసుకునే అలవాటు ఉంది. నేరానికి పాల్పడిన రోజున ఇతర విషయాలను మాత్రం డైరీలో పొందు పరిచారు. అందులో అక్షరాలను.. కొన్ని కోట్స్‌ను పోలీసులు పరిశీలించి నేరా నికి పాల్పడింది వీళ్లేఅని టెక్నికల్‌గానూ గుర్తించారు. మామిడి అజయ్... వృత్తిరీత్యా బైక్ పెయింటర్. చిన్నపాటి పెయింట్ స్ర్పేయర్‌లతో గోడలపై రాతలు రాసే అలవాటు ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దేవాలయాల గోడలపై రాసేందుకు వినియోగించిన స్ర్పేయర్‌లు అజయ్ ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి ఈశ్వరరావు ఎక్కడకు వెళ్లినా సరే గూగు ల్ టైమ్ ఔట్‌ను ఆన్ చేసుకుని వెళ్లేవాడు. కానీ ఉద్దేశపూర్వకంగా మార్చి 29, 30 తేదీల్లో దేవాలయాలపై అన్యమత ప్రచార రాతల్లో పాల్గొన్నప్పుడు టైమ్ ఔట్‌ను ఆపేశాడు. టెక్నికల్‌గా డేటా తీసిన పోలీసులకు ఈ విషయం వెల్లడైంది. అలాగే బుడితి చర్చి నుంచి బొలేరో వాహనంలో బయలుదేరడం.. ముగ్గురూ కలుసుకోవడం... యలమంచిలితోపాటు, ఇతర దేవాలయాల వద్దకు వెళ్లడం... తిరిగి ఇళ్లకు వెళ్లిపోవడం.. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఇవన్నీ పోలీసులు సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. ఇటు టెక్నికల్, అటు విచారణ ఆధారంగా ఆ ముగ్గురినీ సోమ వారం ఉదయం ఏడు గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ఏఎస్పీ శ్రీనివాసరావు, నరసన్నపేట, టెక్కలి, కొత్తూ రు సీఐలు జే.శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, సీహెచ్ ప్రసాద్‌తోపాటు సీసీఎస్ సీఐ చంద్రమౌళిని ఎస్పీ అభినందించారు.
భద్రతా చర్యలుండాలి
మత విద్వేషాలు రేకెత్తించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. ‘ప్రార్థనా మందిరాలు నలువైపులా కనిపిం చేలా సీసీ కెమెరాలు, భద్రతా చర్యలను ఏర్పాటు చేసుకోవాలి. స్థానిక ప్రజల తో యూత్ కమిటీ, పీస్ కమిటీలుగా ఏర్పడాలి. కమిటీ సభ్యులు ఒకరైనా సరే ప్రార్థనామందిరం వద్ద పడుకోవాలి. తగినంత లైటింగ్ సిస్టంను ఏర్పా టు చేసుకోవాలి. మత ఘర్షణలను ప్రేరేపించే అపోహలు, వదంతులను నమ్మి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడద’ని ప్రజలకు ఎస్పీ హితవు పలికారు.