Share News

మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి సతీమణి కన్నుమూత

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:33 PM

హరిశ్చంద్రపురం మాజీ ఎమ్మెల్యే, దివంగత కింజరాపు కృష్ణమూర్తి నాయుడు సతీమణి శార్వాణి (85) సోమవారం విశాఖపట్నంలో కన్నుమూశారు.

మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి సతీమణి కన్నుమూత
అంత్యక్రియల్లో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు (ఇన్‌సెట్‌లో) శార్వాణి (ఫైల్‌)

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): హరిశ్చంద్రపురం మాజీ ఎమ్మెల్యే, దివంగత కింజరాపు కృష్ణమూర్తి నాయుడు సతీమణి శార్వాణి (85) సోమవారం విశాఖపట్నంలో కన్నుమూశారు. కుమారుడు కింజరాపు కృష్ణప్రసాద్‌ ఉత్తరాంధ్ర విద్యుత్‌ ప్రాంతీయ నిఘా విభాగం అధికారి (రీజ నల్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌)గా పనిచేస్తున్నారు. శార్వాణి వృద్ధాప్య సమస్యలతో కుమారుడి స్వగృహం విశాఖపట్నంలో మృతి చెందారు. ఈమె రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు పెద్దమ్మ. శార్వాణి మృతదేహానికి నిమ్మాడలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు పాల్గొని సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి నాయుడు 1967 లో స్వతంత్ర పార్టీ తరఫున హరిశ్చంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిం చారు. ఈయనకు ముగ్గురు సోదరులు వెంకట రాములు, దాలినాయుడు, విశ్వనాఽథం. దాలినాయుడు మంత్రి అచ్చెన్నాయుడు తండ్రి. శార్వాణి అంత్య క్రియల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న కింజరాపు కుటుంబ సభ్యులు పాల్గొని నివాళి అర్పించారు.

Updated Date - Apr 07 , 2025 | 11:58 PM