ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకించాలి
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:57 PM
అడవులను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆపరేషన్ కగార్‌ని దేశ ప్రజలు వ్యతిరేకించాలని సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి పి.ప్రసాద్ కోరారు.

టెక్కలి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): అడవులను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆపరేషన్ కగార్‌ని దేశ ప్రజలు వ్యతిరేకించాలని సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి పి.ప్రసాద్ కోరారు. శనివారం పలాసలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మా వోయిస్టుల నుంచి అడవులను విముక్తిచేసే పేరిట మోదీ సర్కార్ తలపెట్టిన ఆప రేషన్ కగార్ వెనుక కార్పొరేట్లకు అడవులను కట్టబెట్టే రహస్య ఎజెండా ఉందన్నారు. లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద గల అడవులను అంబానీ, అదానీ వంటి కార్పొ రేట్లకి అప్పగించడం కోసం ఆదివాసీలను, వారి పక్షాన పోరాడే మావోయిస్టులను పి ట్టల్లా కాల్చి చంపడాన్ని ఖండించాలని కోరారు.న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సహాయకార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ పలాసలో ఈనెల 13న పైల వాసుదేవరావు ఐదో వర్థంతి సభను న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఏర్పా టు చేసిందన్నారు. సమావేశంలో జుత్తు వీరస్వామి, బాలకృష్ణ, జగన్ పాల్గొన్నారు.