Share News

ఇది కదా టెక్నాలజీ అంటే.. 3Dతో 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ కట్టేశారు..

ABN , Publish Date - Apr 11 , 2025 | 08:17 AM

3D Printed Railway Station: 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని జపాన్ అద్భుతాన్ని సృష్టించింది. ఏకంగా ఆరు గంటల్లో రైల్వే స్టేషన్ కట్టేసింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో నిర్మించిన తొలి రైల్వే స్టేషన్ ఇదే కావటం విశేషం.

ఇది కదా టెక్నాలజీ అంటే.. 3Dతో 6 గంటల్లోనే రైల్వే స్టేషన్ కట్టేశారు..
3D Printed Railway Station

టెక్నాలజీ క్రియేట్ చేస్తున్న అద్భుతాలను చూస్తే మతి పోతోంది. మనుషులకు ఎంత మాత్రము సాధ్యపడని వాటిని కూడా టెక్నాలజీ సుసాధ్యం చేస్తోంది. ముఖ్యంగా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మాణ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ కారణంగా డబ్బు, సమయం, శ్రమ అన్నిటి పరంగా మనుషులకు లాభం చేకూరుతోంది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో మనుషులు సృష్టిస్తున్న అద్భుతాలు నిత్యం వార్తలో వస్తూనే ఉన్నాయి. తాజాగా, జపాన్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో రికార్డు సృష్టించింది. కేవలం ఆరు గంటల్లోనే రైల్వే స్టేషన్‌ను నిర్మించింది. జపాన్‌కు చెందిన సెరెన్ డిక్స్ అనే భవన నిర్మాణ సంస్థ ఈ అద్భుతాన్ని చేసింది.


జపాన్, వాకయామా సిటీలో హట్సుషిమా అనే రైల్వే స్టేషన్ ఉంది. ఆ స్టేషన్‌లో 530 మంది ప్రయాణికులు పట్టే సౌలభ్యం ఉంది. అది సింగిల్ ట్రాక్ రైల్వే స్టేషన్. ప్రతీ గంటకు మూడు రైళ్లు అటు వైపుగా వచ్చి, వెళుతుంటాయి. హట్సుషియా స్టేషన్ చాలా పాతబడిపోయింది. చెక్కలతో తయారైన ఆ స్టేషన్‌ను పడగొట్టి కొత్తది నిర్మించాలని రైల్వే అధికారులు భావించారు. ఈ నేపథ్యంలోనే సెరెన్ డిక్స్ రంగంలోకి దిగింది. సాధారణంగా జపాన్ సంప్రదాయ పద్దతిలో రైల్వే స్టేషన్ కట్టాలంటే రెండు నెలల సమయంల పడుతుంది. ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.


తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో స్టేషన్ నిర్మించాలని సెరెడిక్స్ భావించింది. ఇందుకోసం 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఎంచుకుంది. రైల్వే స్టేషన్ నిర్మాణం జరగాల్సిన రోజు రానే వచ్చింది. రాత్రి చివరి రైలు వెళ్లిపోయిన తర్వాత 3డీ ప్రింటింగ్ సాయంతో రైల్వే స్టేషన్ నిర్మాణం మొదలైంది. 6 గంట్లోనే అద్భుతమైన రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంది. దాదాపు 100 చదరపు అడుగల విస్తీర్ణంలో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో నిర్మించిన తొలి రైల్వే స్టేషన్ ఇదే కావటం విశేషం.


ఇవి కూడా చదవండి

Viral Video:గ్రద్ద ఎంత పని చేసింది.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాల్ టికెట్ ఎత్తుకెళ్లిపోయింది..

Kangana Ranaut: కరెంట్ బిల్ వివాదంలో హీరోయిన్ కంగనా రనౌత్

Updated Date - Apr 11 , 2025 | 08:32 AM