installation of the statue ముగిసిన బంగారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:57 PM
installation of the statue కొరసవాడ గ్రామంలో బంగారమ్మ తల్లి ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి.

పాతపట్నం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): కొరసవాడ గ్రామంలో బంగారమ్మ తల్లి ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు గ్రామ మహిళలంతా ప్రత్యే క వస్త్రధారణతో కల శాలు, ప్రసాదాలతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు చేసి ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లించు కున్నారు. అమ్మవారిని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.50 వేలు విరా ళం అందిం చారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.