Railway Line : అమరావతి రైల్వే లైను పనులకు తొలి అడుగు
ABN, Publish Date - Jan 07 , 2025 | 04:51 AM
తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి రాజధాని అమరావతిని కలుపుతూ నంబూరు వరకు నూతనంగా నిర్మించనున్న 56.53 కి.మీ రైల్వేలైను పనులకు
వైకుంఠపురం నుంచి నంబూరు మార్గంలో విద్యుత్ లైన్ల సర్వే ప్రారంభం
అమరావతి, జనవరి 6: తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి రాజధాని అమరావతిని కలుపుతూ నంబూరు వరకు నూతనంగా నిర్మించనున్న 56.53 కి.మీ రైల్వేలైను పనులకు సంబందించి సోమవారం తొలి అడుగు పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వైకుంఠపురం వద్ద ఉన్న కృష్ణానది నుంచి నంబూరు వరకు రైలు మార్గం ఏర్పాటు చేసే ప్రాంతంలో రైల్వే సర్వేయర్, రైల్వే విద్యుత్ శాఖ అధికారులు సర్వే ప్రారంభించారు. రైల్వే లైను మార్గంలో అడ్డుగా ఉండే విద్యుత్‌లైన్లు తొలగించేందుకు, రైల్వే లైనుకు ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ లైన్లకు సంబంధించి ఈ సర్వే చేస్తున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుకోసం 534.23ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.
Updated Date - Jan 07 , 2025 | 04:51 AM