Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటలో క్షతగాత్రులు కొరిందదే.. ఒప్పుకొన్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:50 PM
Tirupati stampede: తిరుపతిలో తొక్కిసలాట సందర్భంగా తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వారిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ ఘటన ఎలా జరిగిందంటూ వారిని ఆయన అడిగి తెలుసుకున్నారు.
తిరుపతి, జనవరి 09: తిరుపతి తొక్కిసలాటలో తాము తీవ్రంగా గాయపడ్డామని.. ఈ నేపథ్యంలో తనకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలంటూ సీఎం చంద్రబాబును క్షతగాత్రులు కోరారు. వారి కోరికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. తిరుపతిలో చోటు చేసుకొన్న తొక్కిసలాటలో గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రలను సీఎం చంద్రబాబు గురువారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తోపులాట ఎలా జరిగిందో.. భక్తులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.
అలాగే గతానికి.. ఇప్పటికి ఉన్న తేడా ఏమిటని ఈ సందర్భంగా భక్తులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అదే విధంగా ఈ ఘటన గల కారణాలపై భక్తుల నుంచి ఆయన మరింత సమాచారాన్ని సేకరించారు. తిరుపతిలో తాము ఉన్న ప్రదేశంలో కనీసం లైట్లు కూడా లేవని ఈ సందర్భంగా సీఎం దృష్టికి భక్తులు తీసుకు వెళ్లారు. గేట్ తీయ్యడంతో ఒక్క సారిగా భక్తులు లోపలికి చొచ్చుకు రావడంతోనే తోపులాట జరిగిందంటూ సీఎంకు భక్తులు వివరించారు.
శ్రీవారి దర్శనానికి ఎలాంటి సిస్టం పెడితే బాగుంటుంది అనే విషయాలను భక్తులను ఆయన అడిగి.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అయితే.. తమకు స్వామి వారి దర్శనం కల్పించాలని ఈ సందర్భంగా పలువురు భక్తులు.. సీఎం చంద్రబాబుని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులందరికీ వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి.. భక్తులందరికి ఆమోద్య యోగ్యంగా వుండే విధానాన్ని ప్రవేశ పెడతామని భక్తులకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
Also Read: హస్తిన పీఠం కోసం .. బీజేపీ స్కెచ్
జనవరి 10వ తేదీన ముక్కోటి ఏక దశి. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీవారి ఆలయంతోపాటు దేశంలోని అన్ని వైష్ణవ ఆలయాల్లో భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ క్రమంలో తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేసేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు.
Also Read: ప్రధాని మోదీ పర్యటన.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
ఈ టోకెన్లు తీసుకొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుపతి చేరుకున్నారు. ఆ క్రమంలో బుధవారం తిరుపతిలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. 40 మందికిపైగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులు తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని సీఎం చంద్రబాబు పరామర్శించారు.
Also Read: జీహెచ్ఎంసీ ఎదుట మెరుపు ధర్నా.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం
For AndhraPradesh News And Telugu news
Updated Date - Jan 09 , 2025 | 06:33 PM