Share News

Tirupati Stampede Inquiry: తొక్కిసలాట ఘటనపై తుది దశకు న్యాయ విచారణ

ABN , Publish Date - Apr 16 , 2025 | 06:50 AM

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ తుది దశకు చేరుకుంది. వచ్చే నెలలో నివేదిక అందించడానికి కమిషన్‌ సిద్ధంగా ఉంది

Tirupati Stampede Inquiry: తొక్కిసలాట ఘటనపై తుది దశకు న్యాయ విచారణ

  • నేడు తిరుమలకు న్యాయవిచారణ కమిషన్‌

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘తిరుపతి తొక్కిసలాట’ ఘటనపై న్యాయ విచారణ ముగింపు దశకు వచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన 5వ దశ విచారణలో ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఎదుట టీటీడీ తరపున దేవస్థానాల లా ఆఫీసర్‌(డీఎల్వో) వరప్రసాదరావు హాజరయ్యారు. ఘటనకు సంబంధించిన రికార్డులను కమిషన్‌కు అందజేశారు. ఇక జస్టిస్‌ సత్యనారాయణమూర్తి బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు క్యూలైన్లను మరోసారి పరిశీలిస్తారు. చివరిగా విచారణకు హాజరు కావాలంటూ టీటీడీ ఈవోకు సమన్లు పంపనున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో టీటీడీ ఆలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు, సలహాలు, సూచనలతో.. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేయనున్నట్లు తెలిసింది.

Updated Date - Apr 16 , 2025 | 06:50 AM