Tirupati Student: కళాశాల భవనంపై నుంచి దూకి ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
ABN, Publish Date - Apr 04 , 2025 | 05:50 AM
తిరుపతి జిల్లా గూడూరులోని ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ విద్యార్థి జశ్వంత్‌సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యం వేధింపులు కారణంగా ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు

యాజమాన్యంతో తండ్రి మాట్లాడుతుండగానే ఘటన
గూడూరు అర్బన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జశ్వంత్‌సాయి(24) గురువారం భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గూడూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా మనుబోలుకు చెందిన జశ్వంత్‌సాయి రెండు రోజులుగా దిగాలుగా ఉండటాన్ని కళాశాల సిబ్బంది గమనించారు. అతడి తండ్రి సుధాకర్‌రావుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన గురువారం కళాశాలకు వచ్చారు. కొడుకును వెంటపెట్టుకుని కళాశాల రెండో అంతస్తుకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడుతున్నారు. ఇంతలో జశ్వంత్ ఒక్కసారిగా పరుగున వెళ్లి కిటికీలో నుంచి కిందికి దూకేశారు. వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా జశ్వంత్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే తమ బిడ్డను కోల్పోయామని కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట చెబుతూ దర్యాప్తునకు డిమాండ్ చేశారు.
Updated Date - Apr 04 , 2025 | 05:52 AM