Tractor Accident : పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం

ABN, Publish Date - Feb 10 , 2025 | 05:24 AM

చాగంటివారిపాలేనికి చెందిన కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి వస్తుండగా బొల్లవరం శివారు మాదల మేజరు కాలువ వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడింది.

Tractor Accident : పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం
  • ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి

ముప్పాళ్ల, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలేనికి చెందిన కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి వస్తుండగా బొల్లవరం శివారు మాదల మేజరు కాలువ వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ట్రాక్టరులోని నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. బొల్లవరం గ్రామ శివారులో మిర్చికోతలకు వెళ్లిన సుమారు 21 మంది కూలీలు ట్రాక్టర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. రోడ్డు గుంతల మయంగా ఉండటంతో ట్రాక్టర్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న మేజరు కాల్వలో బోల్తా పడింది. మిర్చి టిక్కీలపై కూర్చున్న కూలీలు కిందపడగా, వారిపై టిక్కీలతో పాటు ట్రాక్టర్‌ ట్రాలీ పడింది. ఈ ఘటనలో తేనేపల్లి పద్మ(46), మధిర సామ్రాజ్యం(55), మధిర గంగమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు. చెక్కెర మాధవి(30) సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. ట్రాక్టర్‌ బోల్తా పడుతుందని పసిగట్టిన కూలీల్లో కొంతమంది కిందకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. రిం ముప్పాళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 05:24 AM