Share News

Minister P. Chandrashekhar : కేంద్ర బడ్జెట్‌ విప్లవాత్మకం: పెమ్మసాని

ABN , Publish Date - Feb 20 , 2025 | 03:11 AM

విప్లవాత్మకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.

 Minister P. Chandrashekhar : కేంద్ర బడ్జెట్‌ విప్లవాత్మకం: పెమ్మసాని

తిరుపతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధిపరంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ విప్లవాత్మకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు, యువత, మధ్యతరగతి, పారిశ్రామికవేత్తలు... ఇలా నాలుగు ప్రధాన వర్గాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ రూపకల్పన చేశారన్నారు. రైతులు, మత్స్యకారులకు 4శాతం వడ్డీతో రుణాలందించే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆదాయపన్ను మినహాయింపు వల్ల వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. ఔషధాల ధరలు తగ్గనున్నాయన్నారు. రూ.500 కోట్లతో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

జగన్‌ భాష.. మైండ్‌సెట్‌ మారలేదు!

వైసీపీ అధినేత జగన్‌ భాష, ఆయన మైండ్‌ సెట్‌ ఏమీ మారలేదని పెమ్మసాని వ్యాఖ్యానించారు. బట్టలిప్పి నిల్చోబెడతామని బెదిరిస్తున్న జగన్‌ పార్టీకి ఇపుడు 11 సీట్లు ఇచ్చారని, వచ్చేసారికి ఒక సీటే మిగులుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌ తీరుతోనే రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ అమలు ఆలస్యమైందన్నారు. సీఎం చంద్రబాబు కేంద్రాన్ని అభ్యర్థించడంతో జల్‌జీవన్‌ మిషన్‌ గడువు 2028 వరకూ పొడిగించారని తెలిపారు. సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 03:12 AM