Media Mismanagement : నేరపూరిత చర్యలుగా పరిగణించడానికి వీల్లేదు
ABN , Publish Date - Jan 22 , 2025 | 05:40 AM
సమాచార శాఖ కమిషనర్ హోదాలో తీసుకున్న నిర్ణయాలకు నేరపూర్వక దుష్ప్రవర్తనను ఆపాదించడానికి వీల్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు.

విజయ్‌కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు
ఏసీబీ వాదనల కోసం విచారణ రేపటికి వాయిదా
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): సమాచార శాఖ కమిషనర్ హోదాలో తీసుకున్న నిర్ణయాలకు నేరపూర్వక దుష్ప్రవర్తనను ఆపాదించడానికి వీల్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ అనుచిత లబ్ధి పొందినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. జగన్ మీడియాకు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, అక్కడ పనిచేస్తున్న పలువురు సిబ్బందిని ఐ అండ్ పీఆర్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌లో ఉద్యోగులుగా చట్టవిరుద్ధ నియామకాలు జరిపారని అప్పటి సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిపై ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.దిల్లీబాబురెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయ్‌కుమార్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రకటనల టారిఫ్ పెంపు కమిటీ నిర్ణయం మేరకు జరిగిందని, దీనికి రాష్ట్ర కేబినెట్, ఆర్థికశాఖ ఆమోదం ఉందని పేర్కొన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప క్రిమినల్ చర్యలు ప్రారంభించడానికి వీల్లేదని నివేదించారు. విజిలెన్స్ విచారణకు పిటిషనర్ సహకరిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. పిటిషనర్ తరఫు వాదనలు పూర్తవగానే కోర్టు సమయం ముగియడంతో ఏసీబీ తరఫున ఏజీ వాదనల కోసం విచారణను న్యాయస్థానం ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు ఇచ్చారు.
మాజీమంత్రి మేరుగపై అత్యాచారం కేసు కొట్టివేత
వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ నాగార్జున, మరొకరిపై పోలీసులు నమోదు చేసిన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. మంగళవారం వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, బాధిత మహిళ ప్రమాణపత్రం దాఖలు చేశారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News