Share News

వికసించిన బుట్ట బొమ్మ!

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:29 AM

బుట్ట బొమ్మలా కనిపించే ఈ అరుదైన పుష్పం విశాఖ నగరంలోని పెదవాల్తేరు బయో డైవర్సిటీ పార్కులో గురువారం వికసించింది.

వికసించిన బుట్ట బొమ్మ!

విశాఖ బయా డైవర్సిటీ పార్కులో అరుదైన పుష్పం

చైనీస్‌ లాంతర్‌గా పిలుస్తారంటున్న నిర్వాహకులు

పెదవాల్తేరు (విశాఖపట్నం) ఏప్రిల్‌ 3 (ఆంద్రజ్యోతి):

బుట్ట బొమ్మలా కనిపించే ఈ అరుదైన పుష్పం విశాఖ నగరంలోని పెదవాల్తేరు బయో డైవర్సిటీ పార్కులో గురువారం వికసించింది. ఆర్కిడ్‌ జాతికి చెందిన ఈ మొక్క దక్షిణ బ్రెజిల్‌, అర్జెంటీనా, ఉరుగ్వేలలో కనిపిస్తుంది. ప్రపంచంలోని ప్రసిద్ధ బొటానికల్‌ పార్కుల్లో మాత్రమే ఈ మొక్కలు పెంచుతారు. ఆకట్టుకునే రంగులతో బుట్టబొమ్మను తలపించేలా ఉండే ఈ పువ్వును చైనీస్‌ లాంతర్‌గా కూడా పిలుస్తారని పార్కు నిర్వాహకుడు ఎం.రామమూర్తి తెలిపారు. ఇవి ఆకర్షణీయంగా, సందర్శకులను ఆకట్టుకుంటాయన్నారు. జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆర్కిడ్‌ జాతి మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయన్నారు

Updated Date - Apr 04 , 2025 | 01:29 AM