Share News

నర్సీపట్నం ఆస్పత్రికి అధునాతన అంబులెన్స్‌

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:44 AM

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి ఆసుపత్రికి అధునాతన లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌ కొనుగోలు కోసం ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.35 లక్షలు కేటాయించారు.

నర్సీపట్నం ఆస్పత్రికి అధునాతన అంబులెన్స్‌
కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు రూ.35 లక్షల చెక్కును అందజేస్తున్న ఎన్టీపీసీ సింహాద్రి ఈడీ సమీర్‌శర్మ, అధికారులు

సీఎస్‌ఆర్‌ కింద రూ.35 లక్షలు ఇచ్చిన ఎన్టీపీసీ

అనకాపల్లి కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి ఆసుపత్రికి అధునాతన లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌ కొనుగోలు కోసం ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.35 లక్షలు కేటాయించారు. ఈ మేరకు చెక్కును ఎన్టీపీసీ సింహాద్రి ఈడీ సమీర్‌శర్మ గురువారం కలెక్టర్‌ విజయకృష్ణన్‌ను ఆమె చాంబర్‌లో కలిసి అందజేశారు. సామాజిక బాధ్యత కింద అంబులెన్స్‌ కొనుగోలుకు నిధులు ఇవ్వడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ సింహాద్రి ప్రతినిధులు ప్రసేన్జిత్‌ పాల్‌, బీబీ పాత్ర, కె.ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:44 AM