Crime News: ప్రియుడిపై కోపంతో ఆ మహిళ ఏంచేసిందంటే..
ABN , Publish Date - Apr 01 , 2025 | 07:52 AM
ఆ అపార్ట్‌మెంట్ సీపీ కెమెరాలు లేవు. ఘటన సమీపంలో మహిళ వెళుతున్నట్టు సీసీ ఫుటేజ్ లభ్యం కావడంతో పోలీసులు ఆమె అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఈ నెల 11 వరకు రిమాండ్ విధించింది.

విశాఖ: నగరంలో దారుణం జరిగింది. ప్రియుడిపై (Boyfriend) కోపం పెంచుకున్న ఓ మహిళ (Woman) అతని వాహనాన్ని తగులబెట్టాలని భావించింది. ఈ క్రమంలో అతను ఉంటున్న అపార్ట్‌మెంట్ (Apartment) వద్దకు వెళ్లింది. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతో సెల్లార్‌లో పార్క్ చేసిన ప్రియుడు భరత్ వాహనం (Vehicle)పై పెట్రోలు (Petrol) పోసి నిప్పు (Fire) పెట్టింది. ఈ ఘటనలో అతని వాహనంతోపాటు పక్కనున్న 13 వాహనాలు దగ్ధం అయ్యాయి. బయట పార్క్ చేసిన మరో 5 వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై మార్చి 29న వాహనాల దగ్ధంపై కేసు నమోదు అయింది.
అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు లేవు. ఘటన సమీపంలో మహిళ వెళుతున్నట్టు సీసీ ఫుటేజ్ లభ్యం కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఈ నెల 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పోలీసులు జైలుకు తరలించారు. వాహనాలు దగ్ధం కావడంతో సుమారు రూ. 19 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు.
Also Read..: ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ
విశాఖపట్నంలోని బర్మా క్యాంపునకు చెందిన ఓ యువతి డాబా గార్డెన్స్ విశ్వనాథం రోడ్డు ప్రాంతంలో ఉంటున్న యువకుడిని మూడేళ్ల నుంచి ఇష్ట పడుతోంది. అయితే ఆమెను కాదని ఆ యువకుడు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రేమించిన యువతి అతనిపై కక్ష పెంచుకుంది. ఈ క్రమంలోనే గత నెల 29వతేదీ తెల్లవారు జామున యువకుడు ఉంటున్న అపార్టుమెంట్ వద్దకు వెళ్లి.. సెల్లార్ లోని అతని బైక్‌కు పెట్రోల్ పోసీ నిప్పు పెట్టింది.
బైక్‌కు అంటుకున్న మంటలు పక్కనే ఉన్న మరో 13 వాహనాలకు వ్యాపించాయి. భవనం ఎదుట నిలిపిన మరో 4 బైక్‌లు పాక్షికంగా కాలిపోయాయి. తొలుత ప్రమాదవశాత్తూ జరిగి ఉంటుందని భావించారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించిన తర్వాత నిందితురాలిని గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు
మోదీ ఉపాధి.. బాబు చేయూత: పురందేశ్వరి
For More AP News and Telugu News