బాత్ రూమ్‌లో పాము పిల్లలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:22 AM
స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ సెక్టార్-8లో గల ఓ క్వార్టర్స్‌లోని బాత్ రూమ్‌లో పాము పిల్లలు ఆ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

భీతిల్లిన కుటుంబ సభ్యులు
ఉక్కుటౌన్‌షిప్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ సెక్టార్-8లో గల ఓ క్వార్టర్స్‌లోని బాత్ రూమ్‌లో పాము పిల్లలు ఆ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున బాత్ రూమ్‌లో ఒక పాము పిల్ల కనిపించడంతో నివాసితులు వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్‌కుమార్‌కు సమాచారం అందించారు. ఆయన వచ్చి బాత్ రూమ్‌ను పరిశీలించగా నాలుగు పాము పిల్లలు కనిపించాయి. ఎంతో చాకచక్యంగా ఆయన వాటిని పట్టుకోవడంతో నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు.