Share News

పాతపాడేరులో బడ్డు ఉత్సవం ప్రారంభం

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:40 PM

జిల్లా కేంద్రంలోని పాతపాడేరులో ఇటుకలు పండుగలో భాగంగా బడ్డు ఉత్సవం శనివారం ప్రారంభమైంది.

పాతపాడేరులో బడ్డు ఉత్సవం ప్రారంభం
పాతపాడేరులో బడ్డు ఉత్సవంలో పాల్గొన్న పురుషులు

పాడేరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పాతపాడేరులో ఇటుకలు పండుగలో భాగంగా బడ్డు ఉత్సవం శనివారం ప్రారంభమైంది. అడవుల నుంచి సేకరించిన వివిధ చెట్ల తీగలతో ఒక బడ్డును తయారు చేసి, దానికి మహిళలు పూజలు చేస్తారు. అలాగే తొలి రోజు పురుషులు మాత్రమే బడ్డును లాగుతారు. ఈక్రమంలో బడ్డు ఎవరిపైకి వస్తే వారు విజయం సాధించినట్టు గుర్తిస్తారు. అలాగే ఉత్సవంలో భాగంగా రెండో రోజు ఆదివారం మహిళలు మాత్రమే బడ్డు ఉత్సవంలో పాల్గొంటారు. ఈ ఉత్సవం చూపరులకు కన్నుల పండువగా ఉంటుంది. కార్యక్రమంలో పాతపాడేరు వాసులతోపాటు పాడేరు, కొత్తపాడేరు, సుండ్రుపుట్టు, గొందూరు ప్రాంతీయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 11:40 PM