ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:38 AM
మండలంలోని చింతలూరు గ్రామంలో ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఇద్దరు కూలీలను అధికంగా తేనెటీగలు కుట్టడంతో తీవ్ర అవస్థతకు గురయ్యారు.

ఇద్దరు గిరిజనులకు తీవ్ర అస్వస్థత
చింతపల్లి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలూరు గ్రామంలో ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఇద్దరు కూలీలను అధికంగా తేనెటీగలు కుట్టడంతో తీవ్ర అవస్థతకు గురయ్యారు. బాధితుల కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం చింతలూరు గ్రామ శివారులో నీటి కందకాల నిర్మాణ పనులు చేపడుతున్నారు. అడవి నుంచి తేనెటీగల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో ఉపాధి కూలీలు అక్కడ నుంచి పారిపోయారు. గెమ్మెల లక్ష్మణరావు, కిల్లో చంటిబాబులపై తేనెటీగలు తీవ్ర స్థాయిలో దాడి చేశాయి. దీంతో కుటుంబ సభ్యులు చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.