YSRCP.. వల్లభనేని వంశీ అరెస్టుపై బొత్స స్పందన
ABN, Publish Date - Feb 13 , 2025 | 12:47 PM
వల్లభనేని వంశీ అరెస్టును మాజీ మంత్రి బొత్స సత్యానారయణ ఖండించారు. కేసు వెనక్కు తీసుకుంటే మళ్ళీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను శాసనమండలిలో ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.

విశాఖ: వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader) వల్లభనేని వంశీ ( అరెస్టు (Vallabhaneni Vamsi Arrest)పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Ex Minister Botsa Satyanarayana) స్పందించారు (Respond). ఈ సందర్భంగా గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వల్లభనేని వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసు వెనక్కు తీసుకుంటే మళ్ళీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్ష పూరిత రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని.. ఇలాంటివి రాజకీయాలలో సరికాదని పేర్కొన్నారు. ఋషికొండ భవనాలు ప్రభుత్వ కట్టడాలు.,. నిర్మాణాలలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను మండలిలో ప్రశ్నిస్తామని.. శాసనసభ విషయంలో పార్టీ వైఖరిని తమ వాళ్ళను అడిగి చెప్తానని.. తనకు తెలియని విషయాన్ని తెలుసుకొని చెప్తానని అనడంలో తప్పు లేదు కదా అని బొత్స అన్నారు.
ఈ వార్త కూడా చదవండి..
మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఊరట
సిట్ నివేదికను బయట పెట్టాలి..
రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయని, పండగ కూడా బాగా చేసుకోలేకపోయారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇంకా వేసవి రాకుండానే పవర్ కట్స్ విధిస్తున్నారని, వైసీపీ హయంలో స్కూల్స్ మూసేసారని దుష్ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడు ఫైల్స్ క్లియరింగ్ ఎందుకు ఆలస్యం అవుతుందని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు కదా అని బొత్స ప్రశ్నించారు. ఇప్పటికీ ఒక సిలెండర్ మాత్రమే ఇచ్చారని...తల్లి కి వందనం ఇస్తామని అంటున్నారని.. రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవడం లేదని, నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. గత 5 ఏళ్లలో జరిగిన దాని కంటే..ఈ 9 నెలల్లో ఎక్కువ జరిగాయని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప,.. చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. మండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామన్నారు. గత టీడీపీ, వైసీపీ హయంలో భూకుంభకోణంపై వేసిన సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
పేర్ని నాని హౌస్ అరెస్ట్..
కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో డీఎస్పీ రాజా పేర్ని నాని ఇంటికి వెళ్లారు. శాంతి భద్రతల నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఆయనకు విజ్ఞప్తి చేశారు. పేర్ని నాని హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు నాని ఇంటికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో పేర్ని నాని ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
1980 అనే నంబర్ వాహనంలో వంశీ..
వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు కృష్ణా జిల్లాకు తీసుకువచ్చారు. పోలీసులకు చెందిన 1980 అనే నంబర్ కాన్వాయ్‌లో వంశీని తీసుకువస్తున్నారు. వంశీపై పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. కృష్ణా జిల్లా నుంచి వంశీని పడమట పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నారు. కాగా ఇప్పటికే స్పెషల్ పార్టీ పోలీసులు, ఎస్‌బీ, ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు పడమట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పడమట పోలీస్ స్టేషన్ ఇరువైపులా బార్ గేట్లను ఏర్పాటు చేశారు. డీసీపీ పర్యవేక్షణలో ఏసిపి, సిఐలు పోలీసులు అక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రంగం సిద్ధం చేశారు. మరోవైపు ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరులు సిఐడి కస్టడీలో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..
రుణం కట్టలేదని.. ఇంత దారుణమా..: కేటీఆర్
శ్రీకాకుళం జిల్లాలో జిబిఎస్ వైరస్ కలకలం
వంశీ చుట్టు బిగిస్తున్న ఉచ్చు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 13 , 2025 | 12:47 PM